ఉత్తరాది రాష్ట్రాల్లో తన పర్యటనను మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తుతోన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని.. అసలు ఆయన్ను భరించే శక్తి వారికి లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. ఆ భయంతోనే ఢిల్లీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని, కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు.…