KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది.
CM Revanth Shake Hands KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (డిసెంబర్ 29న) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాహాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.