సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి కొంత కాలంగా దయనీయంగా మారింది. బీఆర్‌ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని.. సొంత యూనియన్ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరివైపు ఉండాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీబీజీకేఎస్ నాయకులు. కవిత, కేటీఆర్‌లో ఎవరికి జై కొడితే... ఎవరు కన్నెర్ర చేస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఈ గందరగోళంతో... ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత…