Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.