ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్…
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
జీవో-3 పై కవిత మహిళాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్- 1 నోటిఫికేషన్ పై ఇచ్చిన మెమో మీరు ఇచ్చారు.. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడు మట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ కుల గణన బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాగా, బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు.
బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు..
లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు.