హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, కనుమరుగవుతున్న జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా గోల్కొండ కోట ప్రాంగణంలో ఉన్న 450 ఏళ్ల నాటి చారిత్రక జలవనరు ‘కటోరా హౌజ్’ పునరుద్ధరణకు హైడ్రా తన పూర్తి సహకారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ఈ కటోరా హౌజ్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.…