తాడిపత్రిలో ప్రముఖ ఫ్యాషన్ షోరూం కాసం షోరూంను సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. షోరూమ్‌లో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాసం సంస్థల చైర్మన్ కాసం నమశివాయ మాట్లాడుతూ.. తాడిపత్రిలో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు. తమ సంస్థ వరంగల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించామని.. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్ ఓపెన్ చేశామని తెలిపారు.