‘కర్వా చౌత్’ రోజు ఉత్తర భారతదేశంలోని వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండగా.. యూపీలోని అలీఘర్‌లో మాత్రం ఉహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్వా చౌత్ రాత్రి నూతన వధువులు జల్లెడలో చంద్రుడిని చూసి తమ భర్తలకు హారతి ఇచ్చి.. కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహరం పెట్టారు. అందరూ మత్తులోకి జారుకున్నాక ఇంటిలోకి డబ్బు, నగలను తీసుకుని పారిపోయారు. ఇలా జరిగింది ఒక ఇంట్లో కాదు.. ఏకంగా 12 ఇళ్లలో జరిగింది.…