కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. ఈ చిత్రం కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య అఫీషియల్ ఫ్యాన్స్ క్లబ్ ఈ చిత్రం విడుదలపై వస్తున్న వార్తలపై ఓ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ.. సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు…