బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రజా నాయకుడిగా ఎదిగిన కర్పూరీ ఠాకూర్ 1924లో…