PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ…