కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ ఆటగాళ్లను సత్కరించడానికి రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలని సిద్ధరామయ్య సర్కార్ ప్లాన్ చేసింది.. విధాన సౌధలోనే సన్మాన కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.. అయితే, విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్‌భవన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు.
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కలకలం సృష్టిస్తోంది. ముడా నుంచి భూమి కేటాయింపులో జరిగిన కుంభకోణంపై ఫిర్యాదులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ శనివారం అనుమతి ఇచ్చారు. 'ముడా కుంభకోణం'పై ధ్వజమెత్తిన ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహాంను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో కలవాలని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశించారు.