Off The Record: కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు ఇక్కడి కమలనాధులు. దాన్ని బట్టి రాజకీయ సమీకరణలు సైతం మారతాయన్న చర్చోపచర్చలు పార్టీలో జరుగుతున్నాయి. కన్నడ నాట గెలిస్తే తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయవచ్చని, ఓడితే మోరల్‌గా దెబ్బ పడుతుందని మాట్లాడుకుంటున్నారు టి బీజేపీ నాయకులు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణే అనుకుంటున్న తమకు…