G-20 Summit: ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ-20 సదస్సులో తెలంగాణ రాష్ట్రంతోపాటు కరీంనగర్‌కు చెందిన కళాకారుల నైపుణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. 20 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటుండగా.. వారంతా తమ షర్టులపై జీ-20కి సంబంధించిన బ్యాడ్జీని ధరించారు.