బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడాలోని కేఫ్ పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్ కేఫ్’ (Kap’s Cafe) పేరుతో కపిల్ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే తాజాగా, ‘కాప్స్ కేఫ్’ నిర్వాహకులు ఈ దాడిని ఖండిస్తూ…