కాంతార చిత్రంలోని ‘వరహరూపం’ పాట కాపీరైట్‌ను ఉల్లంఘించారనే క్రిమినల్ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, దర్శకుడు రిషబ్ శెట్టికి సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ‘కాంతార’ చిత్రంలోని ‘వరహరూపం’ పాటను తొలగించాలని కేరళ హైకోర్టు విధించిన షరతుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కిరగందూర్, శెట్టి దాఖలు చేసిన పిటిషన్‌ను…