కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని పాన్–ఇండియా రేంజ్‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది.…
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టీ (Rishab Shetty) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై భారీ అంచనాలు ఉన్నాయి. 2022 లో సంచలనం సృష్టించిన ‘కాంతార’.. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రాబోతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం కన్నడలో…