Uma Maheswari Death: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారితో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి…
Uma Maheswari: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. అమెరికాలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె, అల్లుడు ఇండియాకు రావాల్సి ఉంది. వాళ్లిద్దరూ వచ్చిన తర్వాతే అంత్యక్రియలను నిర్వహించాలని నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు ఉమా మహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె కళ్లను కుటుంబీకులు దానం చేశారు. భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు. కాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు…
Uma Maheswari Death Mystery: దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు భౌతికకాయం అప్పగించారు. ఈరోజు…
NTR Last Daughter Uma Maheswari: నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఉమామహేశ్వరి మరణవార్తను విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కాగా…