తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో రక్తం మడుగులో ఉన్న వీఆర్ఏను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…