తెలుగు చిత్రసీమలో స్క్రీన్ ప్లే రాయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు ప్రముఖ దర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అనేక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. కె.యస్.ప్రకాశరావుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనుబంధం ప్రత్యేకమైనది. వారిద్దరి కాంబినేషన్ లో “కన్నతల్లి, బందిపోటు దొంగలు, ప్రేమనగర్, సెక్రటరీ” వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఏయన్నార్ తో కె.యస్.ప్రకాశరావు రూపొందించిన తొలి చిత్రం ‘కన్నతల్లి’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో…