విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్‌లు, పాటలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమా రిలీజ్‌కు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట…