మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న భారీ పౌరాణిక చిత్రం కన్నప్ప విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాలని చిత్ర బృందం పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. విష్ణు మంచు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించి, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రసాద్ ల్యాబ్‌లో మంచు మోహన్ బాబు, మంచు…