ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా కరోనాతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్‌లో 50కి పైగా కన్నడ చిత్రాల్లో నటించారు సురేష్ చంద్ర. విలన్ పాత్రలకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. చెలువినా చిత్తారా, ఉగ్రమ్…