కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) అకాల మరణంపై యావత్ సినిమా ఇండస్ట్రీ షాక్‌కి గురైన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణించడాన్ని అతని ఫ్యాన్స్, కన్నడ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా తమ హీరో మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రజలను కంట నీరు పెట్టించింది. ఆయన రూపాన్ని.. ఆయన సినిమాల్లో చూసుకుంటున్నారు అభిమానులు.…