రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి కొందరు వ్యక్తులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదాన్ని నింపింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.…