పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్ కు అక్కడ చుక్కెదురైంది. పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డే తో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు… ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నెలలో తాను బుడాపెస్ట్ లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల…