బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు కంగనా చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసిన సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తాను ఈ దాడి చేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన కంగనా..…