బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “తలైవి” షూటింగ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న “తలైవి” కోసం ఢిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కంగనా తన…