ACB: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.. అయితే, ఆలయ అధికారులు వివాదాల్లో ఇరుకున్న సందర్భాలు అనేకమే.. తాజాగా, దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.. ఆదాయానికి నుంచి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి.. దుర్గగుడి కార్యాలయంతో పాటు విజయవాడలోని నగేష్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇదే సమయంలో నగేష్ బంధువులు, సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది.. తూర్పు గోదావరితో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు..
Read Also: BCCI: కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ.. దరఖాస్తులకు ఆహ్వానం
కాగా, నిన్నే సెలవు పెట్టారట దుర్గగుడి ఉద్యోగి నగేష్.. నేటి నుంచి 4 రోజుల పాటు సెలవు తీసుకున్నారు.. అయితే, నేటి ఉదయం నుంచి నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.. నగేష్ కు ముందస్తు సమాచారం ఉన్న కారణంగానే సెలవులో వెళ్లాడనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు నిన్నటి నుంచి సెలవులో ఉన్నారు పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు.. నిన్నటి నుంచి ఆయన నివాసంలోనూ ఏసీబీ సోదాలు సోదాలు జరుగుతున్నాయి.. నగేష్, రాఘవరావు ఇద్దరూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయట.. సోదాలు మొదలు కాక ముందే ఇద్దరు సెలవుపై వెళ్లటంతో.. వారికి ఏసీబీ సోదాలపై ముందస్తు సమాచారం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.