బాలీవుడ్ తొలి తరం హీరోయిన్‌ల్లో తనదైన రేంజ్‌లో పేరు తెచ్చుకున్న సీనియర్ నటి కామినీ కౌశల్ (98) ఇక లేరు. ముంబయిలోని తన ఇంట్లో ఆమె చివరి శ్వాస విడిచారు. లాహోర్‌లో జన్మించిన కామినీ అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచి రేడియో నాటకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఆమెను.. దర్శకుడు చేతన్ ఆనంద్ 1946లో ‘నీచా నగర్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇదే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం…