కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి హరీశ్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ తన బాధను.. మనందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను.. మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధను మన బాధగా మార్చుకుని ఆగమవుదామా.. మనందరి బాధలు తీర్చే కేసీఆర్ కు అండగా ఉందామా.. ఆలోచించండి అని…
కన్నతల్లి లాంటి తెరాస పార్టీని వీడేదిలేదని కమలాపూర్ మండలం జెడ్పిటిసి లాండిగ కళ్యాణి లక్ష్మణ్ రావు,మాజీ జెడ్పిటిసి మారపెళ్లి నవీన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు మాట్ల రమేష్ తేల్చిచెప్పారు. ఈ రోజు ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని హన్మకొండలోని వారి నివాసంలో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో, పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని కమలాపూర్ మండలంలో తెరాసను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, వరంగల్ అర్బన్…