Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్‌లలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది.