ఏపీలోని మునిసిపల్ స్కూళ్ళ స్థితిగతులు మెరుగుపరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమావేశమైన మంత్రి బొత్స పలు ఆదేశాలిచ్చారు. మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ భేటీకి ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పలు సమస్యలపై…