దుబాయ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను ఆదేశించింది. కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్ పిటిషన్‌ను విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాలు చేశారు. ఫరూక్ 1998 నుంచి…