ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అంటే ఒకరకమైన పెదవి విరుపు కనిపిస్తోంది. అదే చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ‘కళింగ’ సినిమా గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధృవ వాయు విభిన్నమైన కథతో… వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న…