Saraswati Pushkaralu : కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక…
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Kaleshwaram: కాళేశ్వరంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేటి (శుక్రవారం) నుంచి ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి. 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరగడం విశేషం. నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు భక్తులను భక్తిశ్రద్ధలలో ముంచెత్తనున్నాయి. మహోత్సవం ప్రారంభ వేడుకగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు…