కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత?, అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత?, ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని.. వాటాల పంపకాల…