సాంప్రదాయ ఇంధనాల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి పెద్ద ముప్పు ఏర్పడింది. కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీనే భవిష్యత్తుగా ప్రపంచం గుర్తిస్తోంది. ఈ మార్పులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి శంకుస్థాపన చేసిన…