విచారణ అనంతరం ఈడీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారించింది.. 25 ప్రశ్నలు అడిగారు.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది.. కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు... కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడ నేను ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు.