కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదలైన కుర్చీ గోల.. ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించిందా? ఎమ్మెల్యే మేయర్ ను టార్గెట్ చేస్తూ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడం... ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ముప్పు తెచ్చి పెట్టిందా ? ఇప్పుడు కడప మేయర్‌పై వేటుతో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి..
కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది..
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు