Off The Record: కడప.. సీఎం సొంత జిల్లా.. YSR కుటుంబానికి కంచుకోట. పులివెందుల తర్వాత వైఎస్ ప్యామిలీ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కేవలం కడప ఎమ్మెల్యే అని అనిపించుకోవడమే కాదు.. అమాత్య పదవులు చేపట్టి ఓ రేంజ్‌కి వెళ్లిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన నాయకులు కనిపిస్తారు. 1955, 1967 ప్రాంతాల్లో ఎం.రహంతుల్లా గెలిస్తే.. తర్వాత రెడ్డి సామాజికవర్గ నాయకులు 1972 నుంచి…