ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయ్యింది.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. జిత్వానీ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింద�