ఐసిస్‌పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. కాబూల్ పేలుళ్లకు పాల్పడ్డ ఐసిస్-కె టెర్రరిస్టులపై డ్రోన్ దాడులు జరిపింది. పేలళ్ల బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి చంపుతాం అని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది. శనివారం తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్‌స్టేట్ తీవ్రవాదుల అడ్డాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాబూల్ పేలుళ్ల మాస్టర్‌మైండ్ హతమయ్యాడు. అయితే దీనిని అమెరికా సైనిక అధికారులు…