Tiger : తెలంగాణలో పులుల రక్షణపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, పులి వేట ఘటనలు మళ్లీ మానవ క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయి. కొమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్లూరులో జరిగిన ఓ పులి వేట కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పులిని చంపిన అనంతరం దాన్ని పూడ్చిపెట్టిన వేటగాళ్లు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకు చిక్కారు. అటవీ శాఖ అధికారుల దర్యాప్తు ప్రకారం, వేటగాళ్లు ముందుగా విద్యుత్ తీగలను అమర్చి పులిని బలిగా…