Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల కవితను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.