కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా…