బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గుత్తా జ్వాల మంగళవారం (ఏప్రిల్ 22) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నాలుగో పెళ్లి రోజు నాడు తమకు ఆడపిల్ల పుట్టినట్లు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులకు ఫాన్స్ సహా ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. విష్ణుకు ఇప్పటికే ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు. విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ శుభవార్త తెలిపారు.…