Ananthapur Crime: క్షణికావేశం.. మనిషిని రాక్షస్తున్ని చేస్తుంది. ఇలాంటి ఆవేశమే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. కన్న కొడుకు చేతిలోనే వ్యక్తి బలి కావాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. తండ్రిని చంపిన కొడుకు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆయన పేరు సుధాకర్. అనంతపురం జిల్లా పామిడిలో బెస్తవీధిలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాశ్ ఉన్నారు.…