సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు.
ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత స్పందించింది. "ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. న్యాయస్థానంలో న్యాయం జరిగింది. పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ, సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. బాబు ఎదుగుతున్న నేపథ్యం... అతని భవిష్యత్తు, నా మానసిక పరిస్థితి దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నాను. నా అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్న." అని అమృత పేర్కొంది.