కన్నప్ప సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచి, తెలంగాణలో పెంచకపోవడం పై మీడియా నుంచి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసలు టికెట్ హైక్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. “ఏ రోజు థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలు తగ్గిస్తారో, తెలంగాణలో ఆ రోజు నేను మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే…
సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించనుంది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. ఆయన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్…